కాదేది యువతకసాధ్యం
కాదనుకుంటే అన్నీ కష్టాలే..
ఎందుకు రాదనుకుంటే అన్నీ అదృష్టాలే..
తెలంగాణ రాదని నిరుత్సాహమెందుకు యువత
నీ చేతిలోనే ఉంది తెలంగాణ భవిత
తలుచుకుంటే మార్చగలవు తెలంగాణ తల్లి తలరాత
నీ పోరాటాన్ని ముమ్మరం చేస్తే..
ఉద్యమాన్ని ఉధృతం చేస్తే..
తీర్చగలవు తెలంగాణ తల్లి కడుపుకోత
-తెలంగాణ శ్రీనివాస్