Thursday, December 23, 2010

విద్యార్థులం మేం తెలంగాణ విద్యార్థులం

విద్యార్థులం మేం తెలంగాణ విద్యార్థులం
మూగబోయిన తెలంగాణ వీణను మీటి..
నివురుగప్పిన చైతన్యాన్ని నిద్రలేపి..
చితికిన ఆశల్ని చిగురింపజేసి..
అణచివేయబడ్డ తెలంగాణవాదాన్ని పెకిలించి
తరతరాల నిస్పృహను తరిమికొట్టి
నలిగిన హృదయాలను రగిలించి
కణకణమండే నిప్పు కణికలమై..
ఉడికిన యువరక్తాన్ని ఉసిగొల్పి..
ఉరుములమై.. మెరుపులమై..
పిడుగులమై.. ఎగిసిపడే భీకర అలలమై..
కడిలిలో సునామీలమై..
ఉవ్వెత్తున ఎగుస్తాం.. ఉన్మత్త ప్రభంజనాన్ని సృష్టిస్తాం..
దిక్కులు పిక్కటిళ్లేలా.. వలసవాదులు వణికిపోయేలా..
జై తెలంగాణ.. జైజై తెలంగాణ నినాదాలను ప్రతిధ్వనిస్తాం..
విద్యార్థులం మేం .. తెలంగాణ విద్యార్థులం..
-తెలంగాణ శ్రీనివాస్‌