Thursday, December 23, 2010

ప్రభంజనం ఇది ప్రభంజనం

ప్రభంజనం ఇది ప్రభంజనం
తెలంగాణ విద్యార్థుల ప్రభంజనం
ఏబీవీపీ, టీఆర్‌ఎస్వీ, పీడీఎస్‌యూ..
దళితసంఘాలు, బీసీ సంఘాలు..
సంఘమేదైనా పోరాటమొక్కటే..
చేరాల్సిన గమ్యమొక్కటే
సాధించాల్సిన లక్ష్యమొక్కటే
సిద్ధాంతాలు పక్కకుబెట్టి సింహాల్లా దూకిన్రు
లాఠీలకు తలలు అడ్డుపెట్టిన్రు
తుపాలకు గుండెలను ఎదురొడ్డి నిలిచిన్రు
తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన్రు
ఉద్యమానికి రథసారథులయిన్రు
ఉద్యమ ప్రభంజాన్ని ఢిల్లీకి చాటిన్రు
ప్రభంజనం ఇది ప్రభంజనం
తెలంగాణ విద్యార్థుల ప్రభంజనం
-తెలంగాణ శ్రీనివాస్‌