Saturday, November 3, 2012

రాజిరెడ్డి ఆత్మఘోష -(మనసున్నోళ్లు స్పందించండి)

జై తెలంగాణ, జైజై తెలంగాణ. నా ఊపిరినున్నంత వరకూ జై తెలంగాణ నినాదాలు చేసిన. ఏడ గింత తెలంగాణ అలికిడైనా
ఆగమేఘాల మీద ఉరికిన. ఏ పార్టీ, ఏ నాయకుడు తెలంగాణ ఆందోళనలకు పిలుపునిచ్చినా స్వచ్ఛందంగా పాల్గొన్నా తిండితిన్నా తినకున్నా ఉద్యమంలో ముందున్నా. చాలా మంది చెత్తగాళ్ల లెక్క మీడియా కోసమో.. ఫ్యూచర్ లో ఎమ్మెల్యే టికెట్లు ఆశించో నేను ఉద్యమంలో పాల్గొనలే. టీవీలల్ల కనిపియ్యాలని సభా వేదికలెక్కలే. నేను నిజమైన తెలంగాణవాదిని.  ఉరకలెత్తే ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ బిడ్డని. ఎలగందల్ జిల్లా ధైర్యాన్ని ఎలుగెత్తి చాటిన పోరు కెరటాన్ని. సర్కార్ దాష్టీకానికి, పోలీసుల దౌర్జన్యకాండకు, డేట్ దాటిపోయిన బాష్పవాయుగోళానికి బలైపోయిన తెలంగాణ బిడ్డని.
తెలంగాణ కోసం చావుతో కూడా రాజీపడని రాజిరెడ్డిని. నేను కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోలేదు. ఉరేసుకుని ఉసురు తీసుకోలేదు.
మలిదశ ఉద్యమంలో తొలి సమిధను నేను. ఇప్పటివరకు చనిపోయినవారికి భిన్నమైన చావు నాది.
అరేయ్ ఇంకెలా చెప్పాలిరా మీకు. ఈ సీమాంధ్ర లుచ్చాగాళ్లు నన్ను చంపేసిన్రురా. మలిదశ ఉద్యమంలో జరిగిన తొలి సర్కారీ హత్యరా ఇది.
అయినా ఎవరూ స్పందించరేం. దండేసి దండం పెట్టి.. నా శవాన్ని కాలబెట్టి చేతులు దులిపేసుకున్నారేందన్నా. ఇంత దారుణమా అన్నలు.. ఇంత ఘోరమా అక్కలు. హవ్వ ఇంత అన్నాలమా? సర్కార్ చంపితే కూడా కనీసం డీజీపీ ఆఫీస్ ను ముట్టడించాలన్న ఆలోచన రాలేదు మీకు. కనీసం మా జిల్లా బంద్ కు పిలుపునివ్వలేదు. గుజ్జర్ల లెక్క నా శవంతో రాస్తారోకో చేయలేదు. ఒక్క పోలీసోన్ని కూడా గుంజికొట్టలేదు.
ఓ……… ఇప్పుడు ఎన్నికలు లెవ్వు కదా? నా శవం మీద ఓట్లేరుకునే చాన్స్ లేదు కదా? అందుకే ఒక్కపార్టీ కూడా నా చావును సీరియస్ గా తీసుకోలేదు.  ఏందిది? ఇదేం తరీఖా? మీ పార్టొళ్లో.. జేఏసీ నేతలో..  సచ్చిపోతే ఇట్లనే లైట్ తీసుకుంటరా? ఛీ…….. ఇది పద్ధతేనా?  తెలంగాణ ప్రజల ప్రాణాలు పోతుంటే మీరు పంతాలకు పోతున్నరు. మిమ్ముల తప్పు పడ్తలేను బాంచెన్!. జర సోచాయించున్రి. అయినా మీ సంతాపాల కోసమో.. పరామర్శల కోసమో నేను ఉద్యమంలో పాల్గొనలేదు. స్వచ్ఛందంగా తెలంగాణ రావాలనే ఆకాంక్షతో పాల్గొన్న. ఉద్యమంలో సమిధనయినందుకు సంతోషిస్తున్నా.
ఊపిరితిత్తులన్నీ మూసుకుపోయినా నా గుండె చివరి క్షణం వరకు జై తెలంగాణ అని నినదించింది. నన్ను తెలంగాణ తల్లి సగౌరవంగా అక్కున చేర్చుకున్నది.
తెలంగాణ తల్లులు, తండ్రులు, అక్కలు, అన్నలు, తమ్ముళ్లు, చెల్లెల్లు ఇది తెలంగాణ ఉద్యమం. ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని.. తెలంగాణ తల్లికి
విముక్తి కల్గిస్తరని భ్రమపడకండి. మీరే ముందుండి తెలంగాణ సాధించాలి. నా చావుకు బదులు తీర్చుకోవాలి. అట్లని నాకు మాట ఇయ్యండి.
జై తెలంగాణ.. జై జై తెలంగాణ..
ఇట్లు
మీ   రాజిరెడ్డి
సీమాంధ్ర పాలకుల చేతిలో చంపబడ్డ తెలంగాణ బిడ్డను.
తెలంగాణ జాతి కోసం ప్రాణాలర్పించిన రాజిరెడ్డన్నా.. నీ కోరికను మేం నెరవేరుస్తం. సమైక్యవాదులను తరమికొట్టి నీ ఆశయాన్ని నెరవేరుస్తం. నీ కుటుంబానికి తెలంగాణ అండగా ఉంటది. అణువణువునా తెలంగానాన్ని నింపుకున్న రాజన్న కుటుంబం తెలంగాణ సమాజం నుంచి అణా పైసా ఆశించడం లేదు. కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. …………………………………………..
(రాజన్నకు పోరుతెలంగాణ శ్రీనివాస్ కన్నీటి నివాళి …)

Monday, February 20, 2012

జ్వలించిన ఆత్మగౌరవ నినాదం-నమస్తే తెలంగాణ


యాదన్న అమరుడై అప్పుడే రెండేళ్లు గడిచింది. కానీ రావాల్సిన తెలంగాణ ఇంకా రాలేదు. 2010 ఫిబ్రవరి 20, గాయం ‘ఓయూ’ను ఇంకా సలుపుతూనే ఉన్నది. యాదన్న రగిలించిన అగ్గి ఇంకా మండుతూనే ఉన్నది.

20 ఫిబ్రవరి, 2010న ఓయూ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. తొమ్మిది జిల్లాల నుంచి విద్యార్థులనెవ్వరినీ హైదరాబాద్‌లో అడుగు పెట్టనివ్వలేదు. హైదరాబాద్ చుట్టూ వందలాది చెక్ పోస్టులు. వాఘా సరిహద్దును మరిపించేలా సాయుధ పోలీసుల మోహరింపు. అయినా వేలాది మంది విద్యార్థులు ఓయూ చేరుకున్నరు. అప్పటికే అసెంబ్లీ చుట్టు పక్కల ఉన్న విద్యార్థులు ఆరు సార్లు అసెంబ్లీ మీదికి దండయాత్ర చేసిన్రు. విద్యార్థులు, విద్యార్థినులు వందలాది మంది అరెస్టు అయిన్రు. ఎన్‌సీసీ గేట్ నుంచి విద్యానగర్ వరకు ఆరేడు ముళ్లకంచెలు. వేలాది మంది సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నరు. మరో వైపు అసెంబ్లీ ముట్టడిని నిర్వీర్యం చేయడానికి సీమాంధ్ర మీడియా పోలీసులతో చేతులు కలిపింది. ఓ మీడియా సంస్థ కవరేజి ముసుగులో పోలీసుల కోసం ఒక హెలికాప్టర్‌ను హైదరా బాద్‌గగనతలంలో తిప్పింది.

ఎక్కడనుంచి విద్యార్థులు వస్తున్నది కనిపెట్టి పోలీ సులకు సమాచారమందించింది. ఆ హెలికాప్టర్ పోలీసులది కాదని ‘లైవ్ కవరేజి కోసం తామే కిరాయికి తీసుకున్నామ’ని ఆరోజు ఆ మీడియా బ్రేకింగ్ కూడా ఇచ్చిం ది. పోరాటాల గడ్డ ఆర్ట్స్ కాలేజీ నుంచి ఓయూలో ర్యాలీ మొదలైంది. విద్యార్థుల ర్యాలీ ఎన్‌సీసీ గేట్ దగ్గరికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నరు. మధ్యాహ్నం కావస్తున్నది. ముళ్లకంచె దాటి విద్యార్థులు ముందుకు పొలేక పోతున్నరు. ఈ పరిణామాలతో దిగులు పడ్డ యాదయ్య ఓ పోలీసుని ‘అసెంబ్లీ ముట్టడి సక్సెస్ అయితదా అన్నా’అని అడిగిండు. ‘అసెంబ్లీ ముట్టడి ఫేయిల్ అయ్యేట్టే ఉంద’ని ఆపోలీసు చెప్పడంతో యాదన్న గుండె కలుక్కుమన్నది. ఎట్లనన్నా ముట్టడిని సక్సెస్ చేయాలనుకున్నడు యాదయ్య. ఉద్యమానికి వెలుగు దివ్వె కావాలనుకున్నడు. అసెంబ్లీ ముట్టడికి ముందు బ్యాగులో తెచ్చుకున్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని అందరూ చూస్తుండగానే నిప్పంటించుకున్నడు. తన దేహం అగ్గికి ఆహుతవుతుంటే..మొకం మీద చిరునవ్వు చిందిస్తూ ‘జై తెలంగాణ’ అంటూ నినదించిండు. ప్రాణాలను తెలంగాణ కోసం అర్పించిండు. ఆత్మగౌరవ నినాద ఆకాంక్షను ప్రపంచానికి చాటిండు.

యాదన్నా.. నీస్ఫూర్తి, తెలంగాణ కోసం నీవు పడ్డ తపన తెలంగాణ నేతల్లో ఉంటే ఎంత మంచిగుండేది. ఆత్మార్పణ చేయకుండా నీ స్ఫూర్తిని, నీ ఆవేశాన్ని నలుగురికి పంచితే ఉద్యమం ఇంకింత ముందుకు పోయేది. నీ ఆశయ సాధన కోసం యావత్తు తెలంగాణ ముందుకు కదులుతున్నది. ఉద్యమం సమ్మె రూపంలో, రాస్తారోకోల రూపంలో, ఉప ఎన్నికల రూపంలో ముందుకుపోతున్నది. యాదన్న అమర్ రహే. బలిదానాలు బంద్ పెడ్తం. తెలంగాణ వచ్చేదాక బరిగీసి కొట్లాడుతం.

-బైరగోని శ్రీనివాస్

(ఫిబ్రవరి 20 యాదన్న తెలంగాణ ఉద్యమం కోసం కాగడాగా వెలిగి..అమరుడైన రోజు)



Sunday, February 19, 2012

యాదన్న అమరుడై నేటికి రెండేళ్లు -యాదన్నకు www.porutelangana.com ఘన నివాళులు



(బైరగోని శ్రీనివాస్ గౌడ్ www.porutelangana.com)

యాదన్న అమరుడై రెండేళ్లు గడిచింది. కానీ రావాల్సిన తెలంగాణ ఇంకా రాలేదు. తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ చేవలేని దద్దమ్మలు ఆంధ్రోళ్ల సంక నాకుతున్నరు. చెత్త నా కోడుకులు సిగ్గనిపించడం లేదారా ిడియట్స్..

ఫిబ్రవరి 20, 2010, గాయం ఓయూను ఇంకా సలుపుతూనే ఉన్నది. యాదన్న రగిలించిన అగ్గి ఇంకా మండుతూనే ఉన్నది.
ఫిబ్రవరి 20, 2010న ఓయూ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. 9 జిల్లాల నుంచి విద్యార్థులనెవ్వరినీ హైదరాబాద్లో అడుగుపెట్టనివ్వడంలేదు. హైదరాబాద్ చుట్టూ వందలాది చెక్ పోస్టులు, వాఘా సరిహద్దును తలపించేలా సాయుధ పోలీసుల మోహరింపు. అయినా వేలాది మంది విద్యార్థులు ఓయూ చేరుకున్నరు. అప్పటికే అసెంబ్లీ చుట్టుపక్కల ఉన్న విద్యార్తులు ఆరుసార్లు అసెంబ్లీ మీదికి దండయాత్ర చేసిన్రు. విద్యార్థులు, విద్యార్థినులు అరెస్ట్ అయిన్రు. ఎన్ సీసీ గేటు నుంచి విద్యానగర్ వరకు ఆరేడు ముళ్లకంచెలు వేలాది మంది సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నరు మరో వైపు అసెంబ్లీ ముట్టడిని ఫెయిల్‌ చేయడానికి సీమాంధ్ర మీడియా పోలీసులతో చేతులు కలిపింది.
(టీవీ9) కవరేజి ముసుగులో పోలీసుల కోసం ఒక హెలికాప్టర్‌ను హైదరాబాద్‌లో తిప్పింది. ఎక్కడ నుంచి విద్యార్థులు వస్తుదన్నది కనిపెట్టి పోలీసులకు సమాచారమందించింది. ఆ హెలికాప్టర్ పోలీసులది కాదని లైవ్ కవరేజీ కోసం తామే కిరాయికి తీసుకున్నమని ఆ రోజు బ్రేకింగ్ కూడా ఇచ్చింది. . పోరాటాల గడ్డ ఆర్ట్స్ కాలేజీ అడ్డా నుంచి ఓయూలో ర్యాలీ మొదలైంది. విద్యార్థుల ర్యాలీ ఎన్ సీసీ గేట్ దగ్గరికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నరు. మధ్యాహ్నం కావస్తుంది ముళ్ల కంచె దాటి విద్యార్థులు అవతలికి పోలేకపోతున్నరు. ఈ పరిణామాలతో అనుమాన పడ్డ యాదయ్య ఓ పోలీసోడిని అసెంబ్లీ ముట్టడి సక్సెస్‌ అయితదా అన్నా అని అడిగిండు. అసెంబ్లీ ముట్టడి ఫెయిల్ అయ్యేట్టే ఉందని చెప్పిండంతో యాదన్న గుండె కలుక్కు మంది. ఎట్లనన్నా ముట్టడిని సక్సెస్‌ చేయాలనుకున్నడు యాదయ్య. అసెంబ్లీ ముట్టడికి వచ్చే ముందు బ్యాగ్ లో తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని అందరూ చూస్తుండగా నిప్పంటించుకున్నడు. ఎన్ సీసీ గేట్ దగ్గర అందరూ చూస్తుండగా నిప్పంటించుకున్నడు. తన దేహం అగ్గికి ఆహుతవుతుంటే ముకం మీద చిరునవ్వు చిందిస్తూ జై తెలంగాణ అంటూ నినదించిండు. తన ప్రాణాలను తెలంగాణ కోసం అర్పించిండు. సెంబ్లీ ముట్టడిని సక్సెస్‌ చేసి అమరుడయ్యిండు. ఇప్పుడు ఎన్ సీసీ గేట్ యాదయ్య గేట్ గా మార్చేసినం.. యాదన్నకు www.porutelangana.com ఘన నివాళులర్పిస్తుంది.

యాదన్నా ఆత్మార్పణ చేయకుండా నీ స్ఫూర్తిని, నీ ఆవేశాన్ని నలుగురికి పంచితే ఉద్యమం ఇంకింత ముందుకు పోయేది. నీ ఆశయ సాధన కోసం యావత్తు తెలంగాణ ముందుకు కదులుతున్నది. ఉద్యమం సమ్మె రూపంలో, రాస్తారోకోల రూపంలో, ఉప ఎన్నికల రూపంలో ముందుకు పోతున్నది.
యాదన్న అమర్ రహే.. బలిదానాలు బంద్ పెడ్తం.. బరిగీసి కొట్లాడుదం. అగ్గిపుల్లను మనమీద కాకుండా.. తెలంగాణ ద్రోహుల మీద వేద్దాం. సమైక్య పెట్టుబడిదారులను ఆ అగ్గిలో బుగ్గి చేద్దాం.

యాదయ్య అమర్ రహే.. జై తెలంగాణ.. జై జై తెలంగాణ....

Wednesday, January 18, 2012

సమ్మెలు చేస్తే సర్కార్‌ దిగొస్తదా?

సమ్మె షురువైతది. వారం గడుస్తది, 2వారాలు గడుస్తయి, నెల గడుస్తది, చిన్న ఉద్యోగులకు ఇళ్లు గడవదు. మధ్యరకం ఉద్యోగులకు అప్పులు పెరుగుతయి. ఫలితం నెల, రెండు నెలల తర్వాత సమ్మెకు విరామం. సీమాంధ్ర పాలకులు స్పందించరు. వీళ్లకు తోడు తెలంగాణలోని దొంగనేతలు ఉద్యోగులపైనే నీలాపనిందనలు వేస్తరు. ఇవన్నీ కాకుండా సీమాంధ్రపాలకులు దిగిరావాలంటే ఏం చేయాలి?

ఫాలో నల్లగొండ..

ధర్నాలు రాస్తారోకోలు చేస్తే పట్టించుకోని ప్రభుత్వం నల్లగొండ బార్డర్‌లో ఆంధ్ర వెహికల్స్‌పై దాడిచేస్తే పదిగంటల్లో స్పందించింది. సీఎంకు దెబ్బకు దెయ్యం దిగింది.

ఎవరి ఆఫీసుల్లో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను వారే తన్నాలి

ఉద్యోగులు సమ్మె ఆలోచన విరమించి.. తెలంగాణలోని ఆఫీసుల్లో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను తంతే ప్రభుత్వం దెబ్బకు దిగివస్తది. సమ్మె సంవత్సరంపాటు చేసిన ఎవ్వడూ పట్టించుకోడు. ఏ నేతా దిగిరాడు. ఒక్కొక్క ఆంధ్రా ఉద్యోగిని తంతే దెబ్బకు సీమాంధ్ర సర్కార్‌ దెయ్యం వదులుతది. అప్పుడు డిమాండ్స్‌ సాధించుకోవచ్చు.

Thursday, October 13, 2011

వేర్పాటువాదానికి, తెలంగాణావాదానికి తేడా తెలుసుకోనోల్లు మీరేం జర్నలిస్టులు

తెలంగాణావాదం వేర్పాటువాదం అంటూ సీమంధ్ర ఛానళ్ళు పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నై. వేర్పాటువాదం అంటే అర్థం తెలుసా మీకు? వేర్పాటువాదానికి, తెలంగాణావాదానికి తేడా తెలవకుండా జర్నలిస్ట్ లుగా ఎట్లా చేస్తున్నార్ర బై ? వేర్పాటు వాదం అంటే దేశం నుంచి విడి పోవడం. ప్రత్యేకవాదం అంటే రాష్ట్రం నుంచి విడిపోవడం.. సీమంధ్ర నేతలకు మైండ్ ఉండది కాబట్టి వాళ్ళు అంటారు. మీకు కూడా మైండ్ దొబ్బిందా? సీమంధ్ర యాంకర్ లందరూ వేర్పాటువాదం అంటున్నారు. ఆఖరికి hmtv యాంకర్లు కూడా అంటున్నారు.. మీదేమి జర్నలిజం.. మీరేం జర్నలిస్టులు.. ఇప్పటికి అయినా తెలుసుకోండి. వేర్పాటు వాదం వేరు.. తెలంగాణావాదం వేరని. ఇంకా వేర్పాటువాదం అంటే మీకన్నా మూర్ఖులెవ్వరు ఉండరు..

Thursday, September 8, 2011

కాళన్న యాదిలో...



తెలంగాణ వేరైతే

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
తెలంగాణ వేరైతే
తెలుగుబాస మరుస్తారా?

తెలంగాణ వేరైతే
కిలోగ్రాము మారుతుందా?
తెలంగాణ వేరైతే
తెలివి తగ్గిపొతుందా?

తెలంగాణ వేరైతే
చెలిమి తుట్టి పడుతుందా?
తెలంగాణ వేరైతే
చెలిమి లెండిపొతాయా?

కులము తగ్గిపొతుందా
బలము సన్నగిలుతుందా
పండించి వరికర్రల
గింజ రాలనంటుందా?

రూపాయికి పైసాలు
నూరు కాకపొతాయా?
కొర్టు అమలు అధికారము
ఐ.పి.సి. మారుతుందా?

పాకాల, లఖ్నవరం
పారుదలలు ఆగుతాయా?
గండిపేటకేమైనా
గండితుటు పడుతుందా?

ప్రాజెక్టులు కట్టుకున్న
నీరు ఆగనంటుందా?
పొచంపాడు వెలసి కూడ
పొలము లెండిపొతాయా?

తెలంగాణ వేరైతే
దేశానికి ఆపత్తా?
–కాళోజీ
...............

దోపిడి చేసే ప్రాంతేతరులను...

దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం

దోస్తుగ ఉండే వారితొ మేమును
దోస్తే చేస్తం - ప్రాణమిస్తం
ఎంతకు అంత అన్న ధోరణితో
చింతమాని బ్రతుకును సాగిస్తం

తెలంగాణమిది - తెలంగాణమిది
తీరానికి దూరాన వున్నది
ముంచే యత్నం చేస్తే తీరం
మునుగును తానే - మునుగును తప్పక
-కాళోజి
....................

నిర్వాకం

నమ్ముకొని పెత్తనము ఇస్తే
నమ్మకము పోగొట్టుకొంటివి
కుప్పకావలి ఉండి కట్టలు
తప్పదీస్తివి ముద్దెరేస్తివి

సాటివాడు చేరదీస్తే
నోటినిండా మన్ను గొడ్తివి
పదవి అధికారముల బూని
పదిలముగ తల బోడి జేస్తివి

దాపునకు రానిస్తె చనువుగ
టోపి పెడితివి లాభపడితివి
అన్నవై తమ్ముళ్ల తలలను
నున్న జేస్తివి మురియబడితివి

తొత్తులను చుట్టూర జేర్చుక
పెత్తనాలు చేయబడితివి
‘పొచంపాడు’ పథకము
కూచికూచి చేసేస్తివి

‘దొంగ ముల్కి’ సనదులిచ్చి
దొరతనమ్ము వెలిగిస్తివి
తమ్ములను ఇన్నాళ్లబట్టి
వమ్మజేస్తివి తిన్నగుంటివి

ఎన్నిసార్లు మొత్తుకున్నను
అన్నవయ్యును గమ్మునుంటివి
అన్న అధికారమునకు తగిన
న్యాయబుద్దిని కోలుపోతివి

చిలిపి చేష్టలు చేసి ఇప్పుడు
చిలుక పలుకలు పలుకుచుంటివి
–కాళోజి
................

పోదాం పదరా!!

పదరా పదరా పోదాం పదరా
తెలంగాణ సాధిద్దాం పదరా
దొంగల దూరం కొడదాం పదరా
వేరే రాజ్యం చేద్దాం పదరా || పదరా ||

షాట్లకు బెదరక చెదరక పదరా
హిరణ్యకశిపుడు హడలగ పదరా
నర్సింహుడవై ముందుకు పదరా
పదరా పదరా … || పదరా ||

అధికృత హింసనే పాలన అంటే
ప్రహ్లాదుని హేళన చేస్తుంటే
ప్రత్యక్షంగా నర్సింహులమై
ప్రతిహింసకు పాల్పడదాం || పదరా ||

హిరణ్యకశివుల పొట్టలు చీల్చి
ఫెగుల మాలలు చేద్దాం పదరా
పదరా పదరా ….

వేర్పడదామని ఇద్దరికుంటే
కాదను వారిని కాలదన్నమా
వేరే రాజ్యం చేయబూనమా
పదరా పదరా …..

–కాళోజి
................

నాగరికుడా ‘విను’...

నా నోటికాడి బుక్కను
నాణ్యంగా కాజేసిన
నాగరికుడా ‘విను’

నా నాగటి చాలులోన
నాజూకుగ పవ్వళించి
నను కాటేసిన
నాగరికుడా విను?

నావారల చేరదీసి
నానా విధ బోధలతో
నాణ్యంగా నన్ను కొరిగి
నలుబదైదు సంతకాల
నాటకమాడిన నటుడా
నాగరికుడా విను!

కోటిన్నర మేటి ప్రజల
గొంతోక్కటి గొడవొక్కటి
తెలంగాణ వెలిగి నిలిచి
ఫలించెలె భారతాన
భరత మాతాకీ జై
తెలంగాణ జిందాబాద్

-కాళోజి
.............

తెలంగాణ ‘యాస’ నెపుడు యీసడించు

తెలంగాణ ‘యాస’ నెపుడు
యీసడించు భాషీయుల
‘సుహృద్భావన’ ఎంతని
వర్ణించుట సిగ్గుచేటు

వాక్యంలో మూడుపాళ్ళు
ఇంగ్లీషు వాడుకుంటు
తెలంగాణీయుల మాటలో
ఉర్దూపదం దొర్లగానే
హిహీ అని ఇగిలించెడి
సమగ్రాంధ్ర వాదులను
ఏమనవలెనో తోచదు.

‘రోడ్డని’ పలికేవారికి
సడకంటె ఎవగింపు
ఆఫీసని అఘొరిస్తూ
కచ్చేరంటే కటువు
సీరియలంటే తెలుగు
సిల్సిల అంటే ఉరుదు

సాల్టు, షుగర్, టిఫిన్ తెనుగు
షర్కర్, నాష్తంట్ కొంప మునుగు
టీ అంటే తేట తెనుగు
చా అంటే ‘తౌరక్యము’
పొయినడంటే చావు
తోలడమంటే పశువు

దొబ్బడమంటే బూతు
కడప అంటే ఊరి పేరు
త్రోవంటె తప్పు తప్పు
దోవంటేనే దారి.

బొక్కంటే ఎముక కాదు
బొక్కంటె పొక్క తెలివి
మందలిస్తె తిట్టినట్లు
చీవాట్లు పెట్టినట్లు
పరామర్శ కానేకాదు

బర్రంటె నవ్వులాట
గేదంటేనే పాలు
పెండంటె కొంప మునుగు
పేడంటేనే ఎరువు

రెండున్నర జిల్లాలదె
దండి భాష తెలుగు
తక్కినోళ్ల నోళ్ల యాస
త్రొక్కి నొక్కి పెట్టు తీర్పు

వహ్వారే! సమగ్రాంధ్ర
వాదుల ఔదార్యమ్ము
ఎంత చెప్పినా తీరదు
స్నేహము సౌహర్ద్రమ్ము

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
భోయి భీమన్న ఒకడు
బెజవాడ గోపాలుని
సభ్యత నెర్గిన ఆంధ్రుడు

భోయీ భీమన్న ఒకడు
పదారణాల ఆంధ్రుడు
తెనుగు సభ్యత సంస్కృతి
ఆపాద మస్తకంబు
నోరు విప్పితే చాలు
తెనుగు తనము గుబాళించు

కట్టుబొట్టు మాట మంతి
నడక ఉనికి ఒకటేమిటి
ఎగుడు దిగుడు ఊపిరిలో
కొట్టొచ్చే తెనుగు తనము
గోపాల కీర్తనమే జీవిక
పాపము అతనికి

ఉర్డంటే మండి పడెడి
పాటి తెనుగు ఆవేశము
జౌనపదుని లేఖ లేవో
జౌఇన రహిత ప్రాయంబున
వ్రాసినాడు అంతెకాని
తెలివిన పడి, వృద్ధదశలో
కాస్మా పాలిటన్ తనము
శిఖరోహణ అనుకొని
పరిణతి దశ నందు కొనగ
తాపత్రయ పడుచున్నడు

భోయి భీమన్న ఒకడు
తెనుగును రక్షించువాడు
సమైక్యాంధ్రవాది వాడు
భీమశాస్ర్తి అని నాతో
పిలుపించు కొన్నవాడు
జానపదుని లేఖావళి
నాటి సఖుడు భీమన్న
-కాళోజి
............

ప్రత్యేక తెలంగాణ అంటే

ప్రత్యేక తెలంగాణ అంటే
పక్కలిరగ తన్నేందుకు
ఆ.ప్ర.రా. ప్రభుత్వాన్కి
అధికారము ఎక్కడిది?

ప్రజాస్వామ్య రాజ్యాంగం
పరిపాలన గల దేశము
ప్రజా మతము ప్రకటిస్తె
పట్టి కొట్టి చంపేస్తద?

వేలు లక్షలు ప్రజలు
జేలుకేగ సిద్ధపడితే
ఏర్పట్లు చేయలేక
లాఠీచార్జి పరిపాలన?

కాడెద్దుల ధోరణిలో
కూడని పనియే లేదా?
వినిగి వేసారి జనం
హింసకాండ తలబెడితే
కేంద్రానిది బాధ్యతంత

‘ప్రెస్టేజి’ పేర హింస
ప్రభుత్వాన్కి సబబైతె
ప్రాణిధర్మ హింసకాండ
ప్రజలకు కూడా సబబే

బ్రహ్మన్న చంపు చంపు
ఏ పాటి చంవుతావో
తూటాలు ఎన్నున్నయో
పేల్చుకో, ఆబాలం గోపాలం

చంపు చంపు చంపు అనుచు
బరి రొమ్ములతో బజార్లో
తూటాలను ఎదురుతాన్రు
ఒకటో రెండో వుంచుకో
తుదకు ఆత్మహత్యకైన
అక్కరకొస్తె నీకు, లేకుంటే
ప్రాణాలతో ప్రజల చేతికే
చిక్కితే నీకున్నది కుక్కచావు

తస్మాత్ జాగ్రత్త జాగ్రత్తా
భరతమాతాకీ జై
తెలంగాణ జిందబాద్.

–కాళోజి
.................

సాగిపోవుటె బ్రతుకు...

సాగిపోవుటె బ్రతుకు
ఆగిపోవుటె చావు
సాగిపోదలచిన
ఆగరాదిచటెపుడు

ఆగిపోయిన ముందు
సాగనే లేవెపుడు
వేచియుండిన పోను
నోచుకోనే లేవు.

తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలయు.
బ్రతుకు పోరాటము
పడకు ఆరాటము.

బ్రతకదలచిన పోరు
సుతరాం తప్పదు.
చూపతలచిన జోరు
రేపనుట ఒప్పదు.

-కాళోజి

ఇయ్యాళ కాళన్న 97వ జయంతి.. !


సెప్టెంబర్‌ 9
నాలుగుకోట్ల జనుల గొడవ వినిపించిన
తెలంగాణ ప్రతిధ్వని ..!
వలసపెత్తనంపై సమరం సాగించిన
అక్షర సేనాని.. !
సామాన్యుడి గొంతుకై నిలిచిన ప్రజా కవి..!
సకల అధిపత్యాలను చీల్చిచెండాడిన ధీశాలి..!
సాహిత్య ప్రపంచాన తెలంగాణ వెలుగురేఖ..!
ఆ మహనీయుడు ..మన కాళోజీ.. !
ఇయ్యాళ కాళన్న 97వ జయంతి.. !