Sunday, February 19, 2012

యాదన్న అమరుడై నేటికి రెండేళ్లు -యాదన్నకు www.porutelangana.com ఘన నివాళులు



(బైరగోని శ్రీనివాస్ గౌడ్ www.porutelangana.com)

యాదన్న అమరుడై రెండేళ్లు గడిచింది. కానీ రావాల్సిన తెలంగాణ ఇంకా రాలేదు. తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ చేవలేని దద్దమ్మలు ఆంధ్రోళ్ల సంక నాకుతున్నరు. చెత్త నా కోడుకులు సిగ్గనిపించడం లేదారా ిడియట్స్..

ఫిబ్రవరి 20, 2010, గాయం ఓయూను ఇంకా సలుపుతూనే ఉన్నది. యాదన్న రగిలించిన అగ్గి ఇంకా మండుతూనే ఉన్నది.
ఫిబ్రవరి 20, 2010న ఓయూ జేఏసీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. 9 జిల్లాల నుంచి విద్యార్థులనెవ్వరినీ హైదరాబాద్లో అడుగుపెట్టనివ్వడంలేదు. హైదరాబాద్ చుట్టూ వందలాది చెక్ పోస్టులు, వాఘా సరిహద్దును తలపించేలా సాయుధ పోలీసుల మోహరింపు. అయినా వేలాది మంది విద్యార్థులు ఓయూ చేరుకున్నరు. అప్పటికే అసెంబ్లీ చుట్టుపక్కల ఉన్న విద్యార్తులు ఆరుసార్లు అసెంబ్లీ మీదికి దండయాత్ర చేసిన్రు. విద్యార్థులు, విద్యార్థినులు అరెస్ట్ అయిన్రు. ఎన్ సీసీ గేటు నుంచి విద్యానగర్ వరకు ఆరేడు ముళ్లకంచెలు వేలాది మంది సాయుధ పోలీసులు గస్తీ కాస్తున్నరు మరో వైపు అసెంబ్లీ ముట్టడిని ఫెయిల్‌ చేయడానికి సీమాంధ్ర మీడియా పోలీసులతో చేతులు కలిపింది.
(టీవీ9) కవరేజి ముసుగులో పోలీసుల కోసం ఒక హెలికాప్టర్‌ను హైదరాబాద్‌లో తిప్పింది. ఎక్కడ నుంచి విద్యార్థులు వస్తుదన్నది కనిపెట్టి పోలీసులకు సమాచారమందించింది. ఆ హెలికాప్టర్ పోలీసులది కాదని లైవ్ కవరేజీ కోసం తామే కిరాయికి తీసుకున్నమని ఆ రోజు బ్రేకింగ్ కూడా ఇచ్చింది. . పోరాటాల గడ్డ ఆర్ట్స్ కాలేజీ అడ్డా నుంచి ఓయూలో ర్యాలీ మొదలైంది. విద్యార్థుల ర్యాలీ ఎన్ సీసీ గేట్ దగ్గరికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నరు. మధ్యాహ్నం కావస్తుంది ముళ్ల కంచె దాటి విద్యార్థులు అవతలికి పోలేకపోతున్నరు. ఈ పరిణామాలతో అనుమాన పడ్డ యాదయ్య ఓ పోలీసోడిని అసెంబ్లీ ముట్టడి సక్సెస్‌ అయితదా అన్నా అని అడిగిండు. అసెంబ్లీ ముట్టడి ఫెయిల్ అయ్యేట్టే ఉందని చెప్పిండంతో యాదన్న గుండె కలుక్కు మంది. ఎట్లనన్నా ముట్టడిని సక్సెస్‌ చేయాలనుకున్నడు యాదయ్య. అసెంబ్లీ ముట్టడికి వచ్చే ముందు బ్యాగ్ లో తెచ్చుకున్న కిరోసిన్ ను ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని అందరూ చూస్తుండగా నిప్పంటించుకున్నడు. ఎన్ సీసీ గేట్ దగ్గర అందరూ చూస్తుండగా నిప్పంటించుకున్నడు. తన దేహం అగ్గికి ఆహుతవుతుంటే ముకం మీద చిరునవ్వు చిందిస్తూ జై తెలంగాణ అంటూ నినదించిండు. తన ప్రాణాలను తెలంగాణ కోసం అర్పించిండు. సెంబ్లీ ముట్టడిని సక్సెస్‌ చేసి అమరుడయ్యిండు. ఇప్పుడు ఎన్ సీసీ గేట్ యాదయ్య గేట్ గా మార్చేసినం.. యాదన్నకు www.porutelangana.com ఘన నివాళులర్పిస్తుంది.

యాదన్నా ఆత్మార్పణ చేయకుండా నీ స్ఫూర్తిని, నీ ఆవేశాన్ని నలుగురికి పంచితే ఉద్యమం ఇంకింత ముందుకు పోయేది. నీ ఆశయ సాధన కోసం యావత్తు తెలంగాణ ముందుకు కదులుతున్నది. ఉద్యమం సమ్మె రూపంలో, రాస్తారోకోల రూపంలో, ఉప ఎన్నికల రూపంలో ముందుకు పోతున్నది.
యాదన్న అమర్ రహే.. బలిదానాలు బంద్ పెడ్తం.. బరిగీసి కొట్లాడుదం. అగ్గిపుల్లను మనమీద కాకుండా.. తెలంగాణ ద్రోహుల మీద వేద్దాం. సమైక్య పెట్టుబడిదారులను ఆ అగ్గిలో బుగ్గి చేద్దాం.

యాదయ్య అమర్ రహే.. జై తెలంగాణ.. జై జై తెలంగాణ....