భయం భయం అనుక్షణం భయం భయం
చస్తూ బతికే జీవనమెందుకు
బానిసత్వపు బతుకులెందుకు
ఎదురుతిరిగితే నీదే జయం
పిరికివాడివి కాదునీవు..
పిడికిలి బిగించి పోరాడు..
చేవలేని వాడివి కాదు నీవు..
చావుకైనా తెగించిపోరాడు
ఇంకెన్నాళ్లు సీమాంధ్రుల అణచివేతకు బలవుతావు
అణచివేయబడ్డ సోదరా.. ఇకనైనా లేవరా..
తెలంగాణ నీదిరా.. తెగించి కొట్లాడరా..
నీ తల్లి తెలంగాణకు విముక్తి కలిగించరా..
-తెలంగాణ శ్రీనివాస్