Thursday, December 23, 2010

నిర్భయంగా తెలంగాణ గళం విప్పు

తెలంగాణ కోసం మనసులో మదనపడడం కాదు
లోలోపలే కుమిలిపోవడం కాదు
నీవు నిజమైన తెలంగాణవాదివే అయితే..
ఎవడికో భయపడి నీ భావాలను చంపుకోకు
నీ ఆవేదనను దిగమింగకు
నీ ఆవేశాన్ని అణచుకోకు
నిర్భయంగా తెలంగాణ గళం విప్పు
నీ తోటివాళ్లకు కలిగించు కనువిప్పు
ఎందుకంటే తెలంగాణ నీ జన్మహక్కు
జై తెలంగాణ జైజై తెలంగాణ
-తెలంగాణ శ్రీనివాస్‌