రోమ్‌లాంటి నగరం తగలబడడానికే తప్ప..
తలదాచుకోవడానికి కాదని రాసిండు ఆంధ్రకవి ఎండ్లూరి సుధాకర్
తగలబడే చోట తలదాచుకోమని ఎవ్వడు చెప్పిండు
రోమ్‌కు పోయి కామ్‌గా బతుకాలె కానీ..
రోమ్‌లో బ్రహ్మనాయుడు విగ్రహం పెడ్తమంటే వాళ్లు ఊకుంటరా
తెలంగాణ జాగలకొచ్చి విగ్రహం పెట్టి..
తెలంగాణోన్నే కులహీనుడన్నావంటే నీకు ఈ గడ్డ ఎంత స్వేచ్ఛనిచ్చిందో అర్థం చేసుకో
శ్రీశ్రీకి సలాం కొడ్తం కానీ..
కాళోజీని కాలగర్భంలోకి నెడ్తమంటే ఊరుకోం
తెలుగు హిస్టరీ, మిస్టరీ, జ్యాతి, ఖ్యాతి జాన్తానై
జమానా లెక్క మోసం చేసి జబర్దస్తీ చేస్తే కుదరదు భాయి
ఇది తిరగబడ్డ తెలంగాణ.. బస్తీ మే సవాల్ అంటది
బద్మాషులను బజారుకీడుస్తది
మాట భద్రం.. కవిత భద్రం.. బ్లాగ్ భద్రం..
-తెలంగాణ శ్రీనివాస్