జాతి జాతి అని జాంగలు చింపుకుంటరేందిరా భాయ్
ఎవ్వని జాతి.. ఎక్కడి జాతి
ట్యాంక్‌బండ్ మీద విగ్రహాలు ప్రతిష్టించినప్పుడు మీకు జాతి గుర్తుకు రాలేదా
బ్రహ్మనాయుడుకు మా బతుకుకు సంబంధం ఏంది.
నన్నయ్య గురించి తెలిసిన తెలుగుజాతికి..
భాస్కర రామాయణం రాసిన హుళక్కి భాస్కరుడు ఎందుకు గుర్తురాలేదు
అరే భాయి అల్లూరి విగ్రహాన్ని పెట్టేటప్పుడు..
మా కొమరం భీం ఎందుకు కొరగాలేదు
రాయలవిగ్రహాన్ని పెట్టించినోళ్ల కండ్లకు..
మా సర్వాయిపాపన్న ఎందుకు కనబడలేదు
-బైరగోని శ్రీనివాస్